కిరణ్ రెడ్డి మళ్లీ నిద్రలేచాడు..కొత్త కథ చెప్పాడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

కిరణ్ రెడ్డి మళ్లీ నిద్రలేచాడు..కొత్త కథ చెప్పాడు!

AP Special status congress party kiran kumar reddy
అప్పుడప్పుడు మాత్రమే నిద్రలేస్తున్నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన గత ఎన్నికల ముందు గొప్పగా పార్టీ పెట్టాడు. అయితే కనీసం సొంత నియోజకవర్గంలో తమ్ముడిని పోటీ చేయించి డిపాజిట్ సంపాదించలేకపోయాడు. ఇక రాష్ట్రంలో ఎక్కడా కనీసం డిపాజిట్ దక్కలేదు. అలా చెప్పుల పార్టీతో ప్లాఫ్ అయిన కిరణ్ నాలుగేళ్లుగా జనాలకు మొహం చాటేశాడు. ఎన్నికల తర్వాత ఫలితాలను సమీక్షిస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అదీ ఈయన తీరు.

ఇక ఇటీవలే నిద్రలేచి వచ్చాడు. కాంగ్రెస్ లో చేరాడు. చేరి ఏం సాధించాడు అనేది ఏమీ లేదుకానీ.. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెగ్యులర్ గా మాట్లాడేంత తీరిక కూడా ఉన్నట్టుగాలేదు. ఇక తాజాగా కిరణ్ మరోసారి  మాట్లాడాడు.

ఏమనంటే.. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యమట. బీజేపీ కూడా ఇవ్వగలదు కానీ.. బీజేపీ ఇవ్వదని తేలిపోయిందని కిరణ్ అంటున్నాడు. కాబట్టి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే..అదికాంగ్రెస్ పార్టీతోనే సాద్యం అంటున్నాడు. అయినా విభజనతో ఏపీకి తీవ్రమైన ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ మాత్రమే  ఇప్పుడు ఏపీని  ఉద్ధరించగలిగేది కూడా కాంగ్రెస్సే అంటున్నాడు.

అయినా ఏపీని ఉద్ధరించాలంటే కాంగ్రెస్ కు అధికారం దక్కాలి కదా? సోలోగా కాకుండా కూటమితో అధికారం దక్కినా కాంగ్రెస్ పార్టీ ఏపీకి చేయగలిగింది ఏముంది కిరణ్ కుమారా?

No comments:

Post a Comment

Post Bottom Ad