తనుశ్రీ దత్తా లైంగిక వేధింపులపై విచిత్రంగా స్పందించిన బిగ్ బీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

తనుశ్రీ దత్తా లైంగిక వేధింపులపై విచిత్రంగా స్పందించిన బిగ్ బీ


'ఆషిక్ బనాయా.. ఆషిక్ బనాయా..' సాంగులో ఇమ్రాన్ హష్మితో కలసి కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా కొద్ది రోజుల కిందట సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక చిత్రం సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ నానాపటేకర్ తనను లైంగికంగా వేధించాడని పేర్కొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తనుశ్రీ దత్తాకు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి నైతిక మద్దతు లబిస్తోంది. దీనిపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందనను మీడియా కోరగా ఆయన విచిత్రంగా స్పందించారు. 'నేను తనుశ్రీదత్తాను కాదు.. నానాపటేకర్ ను కాదు' ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నారని అమితాబ్ మీడియాను ఎదురుప్రశ్నించడంతో వారు నివ్వెరపోయారు. థగ్స్ ఆప్ హిందుస్థాన్ ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా మీడియా ప్రశ్నకు అమితాబ్ ఇలా వెరైటీగా స్పందించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad