హ్యాపీ బర్త్ డే క్యూటీ, మై క్వీన్ అంటూ అల్లు అర్జున్ భావోద్వేగం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

హ్యాపీ బర్త్ డే క్యూటీ, మై క్వీన్ అంటూ అల్లు అర్జున్ భావోద్వేగం


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' చిత్రం తర్వాత కొంచెం ఎక్కువ గ్యాపే తీసుకున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో కొత్త చిత్రమేదీ ప్రారంభం కాలేదు. లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్నాడని, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడని వార్తలు ఇటీవల వరకు వినిపించాయి. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తాడని బలంగా ప్రచారం జరుగుతోంది. కాగా, టాలీవుడ్ లో మహేశ్ బాబు తర్వాత పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ ఎవరంటే.. అది అల్లు అర్జునేనని చెప్పాలి. ఎందుకంటే ఏ మాత్రం తీరిక దొరికినా తన భార్య, ఇద్దరు పిల్లలతో హాలీడే చెక్కేస్తాడు కాబట్టి. కాగా, నేడు అల్లు అర్జున్ భార్య స్నేహ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భార్యకు ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు.. ఈ హీరో. హ్యాపీ బర్త్ డే క్యూటీ.. మై క్వీన్ అంటూ తన ముద్దుల భార్యపై ప్రేమను కురిపించాడు. దీంతోపాటు ఇద్దరూ కలసి ఉన్న ఒక చక్కటి ఫొటోను కూడా పోస్టు చేశాడు. స్నేహను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో వీరి వివాహం జరగగా అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad