టాలీవుడ్ లో సెప్టెంబర్ నెలంతా అక్కినేని ఫ్యామిలీదేనని చెప్పాలి. ఇదేనెలలో నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య హీరోగా నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' విడుదలైంది. రివ్యూలు అంత పాజిటివ్ గా రానప్పటికీ ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించడం విశేషం. అదేవిధంగా నాగార్జున కోడలు సమంత నటించిన థ్రిల్లర్ మూవీ 'యూటర్న్' కూడా ఇదే నెలలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక.. అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో సెప్టెంబర్ 27న విడుదలైన దేవదాస్ కూడా మంచి విజయం సాధించింది. దీంతో అక్కినేని ప్యామిలీ హాలిడేస్ కు చెక్కేశారు. ముందు నాగచైతన్య, సమంత వెళ్లగా, ఆ తర్వాత అమల, నాగార్జున వెళ్లారు. ఇప్పటికే స్పెయిన్ లో అఖిల్ మూడో చిత్రం షూటింగ్ జరుగుతోంది. దీంతో అందరూ స్పెయిన్ లో సందడి చేసి ఫొటోలకు పోజులిచ్చారు.

No comments:
Post a Comment