Video Of Day

Breaking News

భార్య మొబైల్ నంబరును షేర్ చేసిన బాలీవుడ్ స్టార్!


సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఏ అంశాన్నైనా ట్వీటర్ వేదికగా పంచుకుంటారు. నటీ నటులైతే వారి సినిమాల విశేషాల దగ్గర్నుంచి చిన్న చిన్న విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే తాజాగా తాజాగా తన భార్య నంబరును ట్వీటర్లో షేర్ చేశాడు బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగణ్. ‘కాజోల్‌ ప్రస్తుతం ఇక్కడ(భారత్‌)లో లేరు.  తన వాట్సాప్‌ నంబర్‌ ఇది---- . ఈ నెంబర్‌ ద్వారా ఆమెను సంప్రదించగలరు’ అంటూ పెట్టిన మెసేజ్ కొద్ది సెకన్లలోనే వైరల్‌గా మారింది. రీట్వీట్లు, లైకులతో మార్మోగిపోయింది. కొందరైతే ఏకంగా కాజోల్ నంబరును సేవ్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ పెట్టి మరీ రిప్లై రావట్లేదంటూ వాటి స్క్రీన్ షాట్లతో రీట్వీట్లు చేశారు. అయితే ఈ ట్వీట్ను పొరపాటున చేసి ఉంటారని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ సుమారు ఐదు గంటల తర్వాత అజయ్ మరో ట్వీట్తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇది కేవలం ప్రాంక్ మెసేజ్ అని చెప్పేసరికి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. కానీ కొందరు అభిమానులు ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు కూడా.

No comments