సిమ్ కార్డుకు ఆధార్‌ అవసరం లేదన్న సుప్రీం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

సిమ్ కార్డుకు ఆధార్‌ అవసరం లేదన్న సుప్రీం!


భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధార్‌.. రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనదేనని అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే సమయంలో ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదని తేల్చేసింది. టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగవద్దని చెప్పింది. ఇప్పటి వరకు సేకరించిన యూజర్ల ఆధార్‌ నెంబర్లను టెలికాం కంపెనీలు డిలీట్‌ చేయొచ్చని సూచించింది. బ్యాంక్‌ సేవలకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ, స్కూల్‌ అడ్మినిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదని తెలిపింది. పాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు మాత్రం ఆధార్‌ కచ్చితంగా కావాలని చెప్పింది. ఆధార్‌ నంబర్తో పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతకు భంగం కలుగుతోందంటూ పలు పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో దీనిపై గతంలో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు నెలలుగా ఈ తీర్పును రిజర్వులో ఉంచింది. నేడు ఆధార్‌ చట్టబద్ధతపై కీలక తీర్పు వెలువరించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad