పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం! ధావన్, రోహిత్ శర్మ సెంచరీలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 24, 2018

పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం! ధావన్, రోహిత్ శర్మ సెంచరీలు!


దుబాయ్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ సూపర్ 4 రౌండ్లో పాకిస్తాన్ పై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌ 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు సాధించింది.  భారత స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌ల ధాటికి 58 పరుగులకే పాక్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ పాక్‌ బ్యాట్స్‌మెన్‌ షోయబ్‌ మాలిక్‌ (78), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (44), ఫకార్‌ జమాన్‌ (31), అసీఫ్‌ అలి(30)ల కష్టానికి ఫలితంగా 50 ఓవర్లలో పాక్ జట్టు కనీసం రెండు వందలకు పైగా స్కోర్‌ చేయగలిగింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు సెంచరీలతో రెచ్చిపోయారు. 238 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో ఒకేఒక వికెట్ నష్టపోయి భారత జట్టుకు విజయాన్ని అందించారు. శిఖర్ ధావన్ 100 బంతుల్లో 114 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ 119 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శిఖర్‌ ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. టీమిండియా తర్వాత మ్యాచ్ను దుబాయ్లో సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో ఆడనుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad