హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌పై ప్రతి యేటా నిర్వహించే నిమజ్జన ఘట్టానికి విపరీతమైన రద్దీ ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో ఏటా గణేశ్ నిమజ్జనం సందర్భంలో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. వాహనాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఉన్న ప్రధాన ఊరేగింపు మార్గంతో పాటు మరో 20 ఉపమార్గాల్లోని 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ ఆంక్షలు తెలుసుకోవడానికి గూగుల్‌తో ట్రాఫిక్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగటంతోపాటు గూగుల్ నావిగేటర్, మ్యాప్స్లతోపాటు ట్రాఫిక్ లైవ్‌ను వాహనచోదకులు, ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. గణేశ్ ఊరేగింపుతోపాటు వివిధ మార్గాల్లో ఉన్న ట్రాఫిక్ స్థితిగతుల్ని ప్రత్యేకంగా గూగుల్ అందించనుంది.

No comments:
Post a Comment