బీజేపీ ముఖ్యనేత.. తెలుగుదేశంలోకి జంపింగ్? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

బీజేపీ ముఖ్యనేత.. తెలుగుదేశంలోకి జంపింగ్?

BJPs leader ,Vishnu Kumar raju, jumping TDP
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగే నేతల తీరు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సిద్దాంతాలతో పని లేకుండా నేతలు ఎంచక్కా జంపింగులు చేసే రోజువు ఇవి. ఈ పరంపరలో ఏపీ బీజేపీ ముఖ్యనేత, ఏపీ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా చేరిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈయన బీజేపీని వీడనున్నాడనే వార్తలు వస్తున్నాయి. కమలం పార్టీని వీడి ఈయన తెలుగుదేశం పార్టీలోకి చేరవచ్చు అనే మాట వినిపిస్తూ ఉంది.

బీజేపీలో ఈయనకు మంచి గౌరవమే  దక్కుతూ వచ్చింది. ఏకంగా శాసనసభా పక్ష నేత వంటి పెద్ద బాధ్యతనే ఇచ్చారు. అయితే ఈ బాధ్యతలో ఈయన బీజేపీని బలోపేతం చేసింది ఏమీ లేదు. తన భవితవ్యాన్ని సరిదిద్దుకునేందుకు ఈయనకు శతథా ప్రయత్నించుకొంటూ వచ్చాడు. అందు కోసం అటు చంద్రబాబుతో, ఇటు జగన్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వచ్చాడు.

ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు తన లెక్కల ప్రకారం జంపింగుకు రెడీ అయిపోతున్నాడట. ఈయన తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నాడట.

No comments:

Post a Comment

Post Bottom Ad