సినిమా చాన్సు ఇవ్వాలంటే ముద్దు అడిగాడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, July 02, 2018

సినిమా చాన్సు ఇవ్వాలంటే ముద్దు అడిగాడు!
కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌లో నేనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఫేస్‌ చేశానని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటి, వీర్‌ ది హెడ్డింగ్‌ ఫేమ్‌ స్వర్ణ భాస్కర్‌. క్యాస్టింగ్‌ కౌచ్‌ ప్రస్తుతం ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీల్లో హాట్‌ టాపిక్‌. ఈ విషయం స్వర్ణ భాస్కర్‌  మాట్లాడుతూ.. ఇండస్ట్రిలో తను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు. ‘షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి నాతో దురుసుగా ప్రవర్తించాడు. అతను నా చెవులను ముద్దాడే ప్రయత్నం చేస్తూ ‘ఐ లవ్‌ యూ బేబీ ’ అంటూ విచిత్రమైన చూపులతో సంజ్ఞ చేశాడు. దగ్గరకు వచ్చి తలపై చేయి వేసి దురుసుగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నాకు షూటింగ్‌ మానేసి ఇంటికి వెళ్లిపోవాలనిపించింది. తర్వాత నేను అతన్ని పట్టించుకోలేదు’  అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

హాలీవుడ్‌ ప్రొడ్యుసర్‌ హార్వీ వీన్‌స్టీన్‌ వ్యవహారంతో మొదలైన ‘మీ టూ’ క్యాంపైన్‌తో కాస్టింగ్‌ కౌచ్‌ పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. అది బాలీవుడ్‌ను తాకి సౌత్‌లోనూ పాకి, మన టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఎవరోకరు తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందిస్తూ.. ‘నాకు ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది. నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఓ నిర్మాత దగ్గర పనిచేసే మేనేజర్‌ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడ’ని తనకు ఎదురైన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. మీడియా ముందు  బోల్డ్‌గా మాట్లాడటంతో అప్పట్లో వార్తల్లో కెక్కారు స్వర భాస్కర్‌. ‘వీరే ది వెడ్డింగ్‌’లో తాను చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌పై వచ్చిన విమర్శలను ఆమె ఘాటుగానే తిప్పికొట్టారు. కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌లు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad