'కత్తి'కి సహకరిస్తే కఠిన చర్యలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, July 09, 2018

'కత్తి'కి సహకరిస్తే కఠిన చర్యలు!


బిగ్ బాస్ తెలుగు సీజన్-1 ఫేమ్, ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్‌ తాజాగా శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు మతపెద్దలు ఆందోళనలు చేసిన విషయమూ విదితమే. ఈ విషయంలోనే కత్తి మహేశ్‌పై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యలో కత్తిపై తెలంగాణ పోలీసులు వేటు వేశారు.

గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కేవంల కొందరు వ్యక్తుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని భావించి సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను హైదరాబాద్‌ నుంచి బహిష్కరించినట్లు డీజీపీ తెలిపారు.

ఇతర వర్గాలు, మతాలు, ప్రాంతాల వారి మనోభావాలు దెబ్బతిసే వ్యక్తులకు సహకరించిన వారిపై సైతం చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇతరత్రా మాధ్యమాల ద్వారా ఏ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నోటీసులు జారీ చేస్తామన్నారు. కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన ఓ ఛానల్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad