ఫొటోతో అనుమానాలకు చెక్ పెట్టిన అనుపమ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 10, 2018

ఫొటోతో అనుమానాలకు చెక్ పెట్టిన అనుపమ!


చిత్ర పరిశ్రమలో చిన్న గాసిప్ వచ్చిందంటే చాలు అది నిజమో, అబద్ధమో తెలుసుకునే లోపే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఈ పరిస్థితి మరింత వేగంగా ఉంటుంది. దాంతో వార్తల్లో నిజంలేదంటూ హీరో హీరోయిన్లే చెప్పుకోవాల్సిన పరిస్థితి నుంచి నిరూపించుకోవాల్సి వస్తోంది. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో  ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా షూటింగ్‌లో ప్రకాష్‌ రాజ్‌, అనుపమా పరమేశ్వరన్‌ల మధ్య గొడవలు జరిగాయని తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా అనుపమా కంటతడి పెట్టుకున్నారని కూడా గుసగుసలు వినపడ్డాయి. అయితే అవన్నీ అబద్దమని, వాటిలో నిజం లేదంటూ అనుపమ, ప్రకాష్‌రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad