ఆ హీరోల అభిమానుల మధ్య చిచ్చు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 24, 2018

ఆ హీరోల అభిమానుల మధ్య చిచ్చు!

war between rajinikanth and vijay fans

విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్‌.. రజనీకాంత్‌ అభిమానులు, విజయ్‌ అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. ఒకరిపై మరొకరు మండిపడుతున్నారు. విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద హంగామా సృష్టించారు. చెన్నైలోని రోహిణి థియేటర్‌ వద్ధ సర్కార్‌ చిత్రానికి సంబంధించిన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు విజయ్‌ అభిమానుల భేటీ అయి వారు నటుడు అజిత్‌ అభిమానులను, ఆయన కుటుంబాన్ని కించపరచే విధంగా మాట్లాడారు. అంతే కాకుండా రోహిణి థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన రజనీకాంత్‌ చిత్ర పోస్టర్‌ను చించేశారు. ఇది ఇతర హీరోల అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో విజయ్‌ అభిమానులపై ఇతర నటుల అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad