ఈ నగరానికి ఏమైంది? రివ్యూ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, June 29, 2018

ఈ నగరానికి ఏమైంది? రివ్యూ

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభివన్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరి నటీనటులుగా డి. సురేష్ బాబు నర్మించిన ఈ నగరానికి ఏమైంది? సినిమా నేడు (29-06-2018) విడుదలైంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్‌ సాగర్‌.

తొలి చిత్రం ‘పెళ్ళి చూపులు’ తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమా జాతీయ అవార్డునూ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది?’ నలుగురు మధ్య తరగతి యువకుల కథే ఈ సినిమా. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్‌ తాను పనిచేస్తున్న క్లబ్‌ ఓనర్‌ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్‌ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ చేస్తూ ఉంటాడు. ఈ కథలో కీలకమైన వివేక్‌ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్‌ ఫిలింస్ తీసి ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమ విఫలం కావటంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటుంటాడు. కానీ అనుకున్నట్టుగా కార్తీక్‌కి ఓనర్‌ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. బార్‌లో ఫ్రెండ్స్‌ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు. అలా గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ.

విషయం: ‘ఈ నగరానికి ఏమైంది’లో కథేమీ ఉండదు. కానీ నలుగురు స్నేహితుల జీవిత ప్రయాణాన్ని దాన్ని యువతకు నచ్చేలా తీశాడు డైరెక్టర్. వివేక్‌ యాటిట్యూడ్‌, కార్తీక్‌ సిన్సియారిటీ, కౌశిక నవ్వులు, ఉపేంద్ర అమాయకత్వం ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో షేడ్‌ ఇచ్చి, వాటితోనే వినోదం పండించే ప్రయత్నం చేశాడు. సినిమాలో 60 సన్నివేశాలు ఉంటే, ఏ సన్నివేశంలోనూ సినిమాటిక్‌ ఉండదు. నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నట్లు కలిసి ప్రయాణం చేస్తున్నట్లు, కొట్టుకుంటున్నట్లు ఉంటుంది. సంభాషణల్లో ఉండే, సహజత్వం అందం ఆయా సన్నివేశాలను పూర్తిగా నిలబెట్టాయి.
ద్వితీయార్ధం మొత్తం గోవా నేపథ్యంలోనే సాగుతుంది. అక్కడకు వెళ్లిన తర్వాత కథను నడిపించడం కాస్త కష్టమైంది. అక్కడ షార్ట్‌ ఫిల్మ్‌ కోసం ప్రయత్నాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాకపోతే మధ్య మధ్యలో తరుణ్‌ భాస్కర్‌ తన రచనా నైపుణ్యం చూపించడంతో కొన్ని సన్నివేశాలు మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. చివర్లో ఎమోషన్‌ పండించే అవకాశం ఉన్నా, దాని జోలికి వెళ్లకుండా కథను మరింత సహజంగానే ముగించాడు. బలమైన కథ లేకపోవడంతో సన్నివేశాలు అప్పుడప్పుడు పట్టు తప్పినట్లు, పాత్రలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నట్లు అనిప్తాయి. వివేక్‌ పాత్రలో ‘అర్జున్‌రెడ్డి’ ఛాయలు కనిపించడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ప్రేమ జంట విడిపోవడానికి పెద్ద కారణం లేకపోవడం దాన్నే తలచుకుంటూ వివేక్‌ కొన్నేళ్ల పాటు స్నేహితులకు దూరంగా ఉండటం అతకలేదు. మద్యం తాగే సన్నివేశాలు ఎక్కువ కావడం కుటుంబ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించేదే. యువతరానికి నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. వాటిని నమ్ముకునే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది.

సినిమాలో నటించిన నలుగురూ కొత్తవారు అయినప్పటికీ వారు తమ శక్తికి మించి నటించారు. ముఖ్యంగా కౌశిక్‌ నటన ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాల్లో నవ్విస్తుంది. ముఖ్యంగా వివేక్‌ మద్యం సేవిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చొని హావభావాలు పలికించిన తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. కథానాయికలు అందంగా కనిపించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad