కటకటాల్లోకి కండల వీరుడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, April 06, 2018

కటకటాల్లోకి కండల వీరుడు!

salman-arrested
1998 నాటి కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు, కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సహ నటులు సైఫ్‌ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలతో పాటు స్థానిక వ్యక్తి దుష్యంత్‌ సింగ్‌ను ‘బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌’ కింద కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలాఉంటే కోర్టు తీర్పు అనంతరం సల్మాన్‌ ఖాన్‌ను పోలీసులు జోధ్‌పూర్‌ కేంద్ర కారాగారానికి తరలించారు. స్టే లేదా బెయిల్‌ కోసం శుక్రవారం సెషన్స్‌ కోర్టులో సల్మాన్‌ తరఫు న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ అప్పీలు చేయనున్నారు.

సల్మాన్ ఖాన్ కేసు విషయంలో దేశమంతా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. నిజానికి మార్చి 28నే వాదనలు పూర్తయినప్పటికీ తీర్పును కోర్టు వారు రిజర్వ్ చేసి గురువారం వెల్లడించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51 సెక్షన్‌ కింద సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad