కాలా, విశ్వరూపం–2 సినిమాలకు లైన్ క్లియర్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, April 19, 2018

కాలా, విశ్వరూపం–2 సినిమాలకు లైన్ క్లియర్!

kala movie rajini Tamil Movies Coming Out in Theaters
డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, థియేటర్ల సంఘాలతో నెలకొన్న సమస్యల నేపథ్యంలో గత మార్చి 1 నుంచి కొత్త చిత్రాల విడుదలను, 16వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేసి తమిళ సినీ పరిశ్రమ సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో అయితే తాజాగా 48 రోజుల సమ్మె అనంతరం ఆ రాష్ట్ర సమచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్‌ రాజు నేతృత్వంలో మంగళవారం సినీ సంఘాల నేతలు నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. దీంతో రజినీకాంత్ నటించిన కాలా, కమల్ హాసన్ విశ్వరూపం-2తోపాటు మరో ముప్పైకి పైగా సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాలను తెరమీద చూడడం కోసం కోలీవుడ్‌ ఆశగా ఎదురుచూస్తోంది.
విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలివే!
vishwaroopam movie kamal hasan Tamil Movies Coming Out in Theaters

కాలా, విశ్వరూపం– 2, మెర్క్యూరీ, మిస్టర్‌ చంద్రమౌళి, మోహిని, కరు, టిక్‌ టిక్‌ టిక్, నరకాసురన్, ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు, గజినీకాంత్, ఇరుంబుతిరై, అసురవధం, పరియేరుమ్‌ పెరుమాళ్, ఆణ్‌దేవదై, అభియుమ్‌ అనువుమ్, భాస్కర్‌ ఒరు రాస్కెల్, సర్వర్‌సుందరమ్, కుప్పత్తురాజా, ఆర్‌కే.నగర్, పార్టీ, కడైకుట్టిసింగం, ఇమైకా నోడిగళ్‌ అంటూ 30 చిత్రాలకు పైగా విడుదలకు రెడీగా ఉన్నాయి. సెన్సార్‌ అయిన తేదీ ప్రకారం చూస్తే కాలా చిత్రం ఈ నెల 27న విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. కాలా కంటే ముందే విశ్వరూపం–2 సెన్సార్‌ను పూర్తి చేసుకుని ఉండడంతో ఆ చిత్రమే ముందుగా తెరపైకి రావాల్సి ఉంది. ఈ విషయంలో నిర్మాతల మండలి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

No comments:

Post a Comment

Post Bottom Ad