జీవితంలో ఆస్ట్రేలియాకు ఆడనన్న వార్నర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 31, 2018

జీవితంలో ఆస్ట్రేలియాకు ఆడనన్న వార్నర్


బాల్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారం అనూహ్యంగా బయటపడి, ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను సంక్షోభానికి గురిచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను శాశ్వతంగా క్రికెట్‌ నుంచి తప్పుకునేలా చేశాయి. అవును. శనివారం మరోమారు మీడియా ముందుకు వచ్చిన వార్నర్‌ తన తప్పునకు శిక్షగా జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడబోవడం లేదని వెల్లడించారు. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియాకు రాజీనామా చేసినట్లు ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు వార్నర్‌. కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్‌ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని వివరించారు. తన ప్రవర్తన సరిగా లేదని దీనిపై నిపుణుల సాయం తీసుకుంటానని అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad