‘రంగస్థలం’ మూవీ రివ్యూ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 31, 2018

‘రంగస్థలం’ మూవీ రివ్యూ

టైటిల్ : రంగస్థలం
జానర్ : పీరియాడిక్‌ ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : రామ్‌ చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, అనసూయ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : బి. సుకుమార్‌
నిర్మాత : నవీన్‌ ఎర్నెనీ, వై. రవి శంకర్‌, మోహన్ చెరుకూరి
రేటింగ్: 4.5/5

rangasthalam review
రామ్‌ చరణ్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా రంగస్థలం. సుకుమార్‌ తన చిన్ననాటి అనుభవాలతో 80ల నాటి కాలాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. రంగస్థలం 1980ల కాలంలోని ఓ గ్రామం. ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) ఆ గ్రామ ప్రెసిడెంట్‌. 30 ఏళ్లుగా గ్రామాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తుంటాడు. ఆ ఊళ్లో పొలాలు తడపడానికి మోటర్‌ పెట్టే కుర్రాడు చిట్టిబాబు (రామ్‌ చరణ్‌). వినికిడి లోపంతో ఇబ్బంది పడే చిట్టిబాబు, రామలక్ష్మీ(సమంత)ని చూసి ఇష్టపడతాడు. దుబాయ్‌ లో ఉద్యోగం చేసే చిట్టిబాబు సోదరుడు కుమార్‌ బాబు( ఆది పినిశెట‍్టి) ఏడాది తరువాత రంగస్థలం గ్రామంలో అడుగుపెడతాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. కానీ గతంలో ఫణీంద్ర భూపతికి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్న వారంత చనిపోయారని తెలుసుకున్న చిట్టిబాబు.. తన అన్నకు ఏమైనా జరుగుతుందేమో అని భయపడతాడు. అనుకున్నట్టుగానే కుమార్‌ బాబును కూడా చంపేస్తారు. కానీ చనిపోయే ముందు కుమార్‌ బాబు, చిట్టిబాబుతో ఏదో చెప్పాలని ప్రయత్నించినా అది చిట్టిబాబుకు వినిపించదు. కుమార్ బాబు, చిట్టిబాబుకు ఏం చెప్పాలనుకున్నాడు..? కుమార్ బాబు చావుకు ప్రెసిడెంటే కారణమా..?  ఈవిషయాలను చిట్టిబాబు ఎలా కనిపెట్టాడు..? అన్నదే మిగతా కథ. ప్రకాష్ రాజ్, నరేష్‌, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం. 80ల నాటి కథకు తగ్గ బాణీలతో సినిమా రిలీజ్‌కు ముందు అంచనాలు పెంచేశాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలోనూ ఏ మాత్రం కమర్షియల్ వాల్యూస్‌ తగ్గకుండా సూపర్బ్‌ సాంగ్స్‌ తో అలరించాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad