జస్టిస్ చలమేశ్వర్ మళ్లీ తిరుగుబావుటా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 30, 2018

జస్టిస్ చలమేశ్వర్ మళ్లీ తిరుగుబావుటా

justice-chelameswarletter to chief justice
సుప్రింకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ మళ్ళీ సంధించిన లేఖలు న్యాయవ్యవస్థలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడంపై ఆయన ఫుల్ కోర్టు సమావేశం జరపాలని చీప్ జస్టిస్ దీపక్ మిశ్రాకు లేఖ రాయడం విశేషం. న్యాయ వ్యవస్థ-ప్రభుత్వానికి మధ్య ‘ఉల్లాసపూరిత స్నేహ సంబంధాలు’ ఉండడం ప్రజాస్వామ్యానికి మృత్యుఘంటికేనని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టును కాదని కేంద్ర న్యాయశాఖ నుంచి నేరుగా వచ్చిన ఆదేశాల మేరకు ఒక సీనియర్‌ జిల్లా న్యాయమూర్తికి వ్యతిరేకంగా విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. హైకోర్టు న్యాయమూర్తి పదవి కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పి.కృష్ణభట్‌ అనే జిల్లా జడ్జికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టు విచారణ చేయడంపై చలమేశ్వర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ చలమేశ్వర్ తిరుగుబాటు ఎటువైపు దారి తీస్తుందో!

No comments:

Post a Comment

Post Bottom Ad