గూగుల్‌ డేటా ఎంత వరకు సురక్షితం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 31, 2018

గూగుల్‌ డేటా ఎంత వరకు సురక్షితం!

is-google-data-safe

ఫేస్ బుక్ డేటా లీక్‌ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్‌ మీడియా యూజర్ల వ్యక్తిగత  సమాచారం ఎంత సేఫ్‌గా ఉందనే ప్రశ్నలు హడలెత్తిస్తున్నాయి. అయితే మనం ప్రతీ చిన్న విషయానికి ఆధారపడే ‘గూగుల్‌’లో మనకు సంబంధించిన ప్రతీ అంశమూ నిక్షిప్తమై ఉంటుంది. మొబైల్‌ ఫోన్‌లో లొకేషన్ ఆన్ చేసి ఉంచితే చాలు.. ప్రతీసారి మీరెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది! ఫోన్లో గూగుల్‌ యాప్‌ను  ఉపయోగించడం మొదలుపెట్టిన తొలిరోజు  నుంచి ఇప్పటివరకు ఎక్కడెక్కడికి వెళ్లారో తేదీలతో సహా ‘టైమ్‌లైన్‌’లో రికార్డయి ఉంటుంది. గూగుల్‌లో  సెర్చ్‌ చేసిన ప్రతీ అంశం కూడా సేవ్‌ అయ్యే ఉంటుంది. యూట్యూబ్‌లో చూసిన వీడియోలు, కంటెంట్‌ హిస్టరీతో పాటు ఈ వివరాలన్నీ కూడా గూగుల్‌ వద్ద నిక్షిప్తమై ఉంటాయి. అంతేకాదు.. ఏయే యాప్‌లను, ఎప్పుడెప్పుడు, ఎందుకు ఉపయోగిస్తున్నారో, వాటి ద్వారా ఏయే దేశాలకు చెందినవారితో సంభాషిస్తున్నారో, ఏ టైమ్‌లో నిద్రపోతున్నారన్నది కూడా గూగుల్‌కు తెలుసు. మరి ఇదంతా భద్రమేనా?

No comments:

Post a Comment

Post Bottom Ad