వారం రోజులుగా తల లేకుండానే తిరుగుతున్న కోడి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 30, 2018

వారం రోజులుగా తల లేకుండానే తిరుగుతున్న కోడి!

hen with out head
థాయ్‌లాండ్‌లో ఓ కోడి వారం రోజులుగా తల లేకుండానే జీవిస్తోంది. రచ్చబురి రాష్ట్రంలో గుర్తించిన ఈ కోడిని ఓ పశువైద్యురాలు సంరక్షిస్తున్నారు. దాని మెడ కిందగా గొంతులోకి ఆహారం వేస్తూ.. యాంటిబయాటిక్స్‌ ఇస్తూ పోషిస్తున్నారు. ‘తల లేకున్నా ఈ కోడి భయపడడంలేదు. బాగానే స్పందిస్తుంది. ఇదినిజంగా ధైర్యమున్న కోడి’ అని ఆమె ప్రశంసించారు. దీని తల ఎలా తెగిపోయిందో తెలియదని, ఏదైనా ఇతర జంతువు దాడిలో ఇలా జరిగిఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. 1945-47 మధ్య అమెరికాలో ఓ కోడి తల లేకుండా 18 నెలలు జీవించి రికార్డులకు ఎక్కిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.

No comments:

Post a Comment

Post Bottom Ad