బాబును నమ్మలేమన్న సిపిఐ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 30, 2018

బాబును నమ్మలేమన్న సిపిఐ

cpi ramakrishna comments on cbn
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తాము నమ్మలేమని సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఒకవైపు పోరాటం అంటూనే, మరో వైపు ఆంక్షలు పెడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేసే వారి మాయలో పడొద్దని అసెంబ్లీలో సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జపాన్‌ తరహాలో ఉద్యమించాలని చంద్రబాబు చెబుతున్నారని, జపాన్‌లో అవినీతికి పాల్పడితే ఉరితీస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ దేశంలో అవినీతికి పాల్పడిన మంత్రులను జైల్లో పెట్టారు.. ఇక్కడ పెడతారా? అని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 1న విద్యార్థి జేఏసీ చేపట్టిన ఆందోళనకు మద్దతిస్తామని తెలిపారు. అలాగే ఏప్రిల్‌ 5న రాత్రి 7గంటల నుంచి 7 30 గంటల వరకు అరగంట పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి బ్లాక్‌డేగా పాటిస్తామన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad