టీఆర్టీ రాయనున్న 2,77,518 మంది అభ్యర్థులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, February 23, 2018

టీఆర్టీ రాయనున్న 2,77,518 మంది అభ్యర్థులు

trt exams started today

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ)లు నేటి నుంచి (ఫిబ్రవరి 4, శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు పదిరోజుల పాటు సాగే ఈ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,77,518 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లోనే అత్యధిక పోటీ నెలకొంది. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు తక్కువున్నా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో వీటికి అధిక పోటీ కారణమైంది. 1,941 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,906 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థులు తక్కువగా ఉండటంతో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పో
స్టులకు మాత్రం పోటీ తక్కువే ఉంది. 5,415 ఎస్‌జీటీ పోస్టులకు 89,000 దరఖాస్తులు వచ్చాయ. అంటే ఒక్కో పోస్టుకు 16.49 మంది పోటీ పడుతున్నారు. పోస్టుల్లో 80 శాతం జిల్లా స్థాయి లోకల్‌ పోస్టులే కావడంతో ప్రధాన పోటీ జిల్లా పరిధిలోనే ఉండనుంది. మిగతా 20 శాతం ఓపెన్‌ పోస్టుల్లో అన్ని జిల్లాల వారూ పోటీలో ఉంటారు. ఉపాధ్యాయ పోస్టులకు అత్యధిక పోటీ మహబూబ్‌నగర్‌లోనే నెలకొంది. జిల్లాలో 1,979 పోస్టులకు 42,529 మంది పోటీ పడుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) మినహా మిగతా అన్ని కేటగిరీల్లోనూ మహబూబ్‌నగర్‌లోనే అత్యధిక పోటీ నెలకొంది. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో నల్లగొండలో, ఎస్‌జీటీ పోస్టుల్లో మెదక్‌లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్లకు మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 19,396 మంది, ఆ తర్వాత నల్లగొండలో 18,798 మంది పోటీ పడుతున్నారు. ఎస్‌జీటీ పోస్టులకు మహబూబ్‌నగర్‌లో 17,639 మంది, ఆ తర్వాత మెదక్‌లో 11,173 మంది పోటీ పడుతున్నారు.

ఓపెన్‌ కోటాకు అన్ని జిల్లాల్లో పోటీ
కొన్ని జిలాల్లో కొన్ని కేటగిరీలో పోస్టులు లేవన్న ఆందోళన ఈసారి అభ్యర్థులకు అవసరం లేదు. ఇతర జిల్లాలోని ఓపెన్‌ కోటా పోస్టు కోసం సొంత జిల్లాను వదిలి, ఇతర జిల్లాకు వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులిచ్చే జిల్లా ప్రాధాన్యాల ఆప్షన్‌ ప్రకారం ఆయా జిల్లాల్లోని ఓపెన్‌ కోటా పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులూ పోటీలో ఉండేలా ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad