జగన్పై తప్పుడు కేసు.. మోదీకి నోటీసు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

జగన్పై తప్పుడు కేసు.. మోదీకి నోటీసు

The Mauritius government has dragged India to the International Court of Justice for arbitration in the InduTech Zone Investments case.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు చేతగాక నాటి రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో యూపీఏ సర్కారులు సీబీఐ కేసులతో జగన్ ను లొంగదీసుకునే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి అడుగుజాడల్లో పయనించే జగన్మోహన్ రెడ్డి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఎత్తులకు లొంగకుండా ఎదురొడ్డి నిలబడ్డాడు. ఇదిలాఉంటే ఆనాడు ఉన్నవీ, లేనివీ పోగేసి కేసులు పెట్టిన సీబీఐ.. పెట్టుబడి విషయంలో ఇందు టెక్ జోన్ కంపెనీపై కూడా కేసు పెట్టింది. దాంతో ఆ కంపెనీ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఒక విదేశీ సంస్థ ఇప్పుడు కేంద్రంపై దావా వేసింది. నెదర్లాండ్స్ లోని దహేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆ సంస్థ ఆశ్రయించింది. ఇందుటెక్ జోన్ లో 49 శాతం పెట్టుబడి పెట్టిన మారిషస్ కు చెందిన కరీషా ఇన్వెస్టె మెంట్ ఎల ఎల్ సి సంస్థ ఈ దావా వేసినట్లు కదనం. తమకు నష్టం జరిగిందని ఆ కంపెనీ చెబుతూ ప్రదాని నరేంద్ర మోడీ తో కేంద్ర ఆర్దిక,తదితర శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చడంతో వారికి అంతర్జాతీయ కోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. అయితే రాజకీయం కోసం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడం ఎంత నష్టదాయకమన్నది అర్ధం అవుతుంది. ఏదైనా మోసం జరిగితే కేసులు పెడితే తప్పు లేదు. కాని ఎవరో రాసిన అనామక లేఖ ఆదారంగా కేసులు పెట్టడం, పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడం వంటివి ఎంత నష్టం చేస్తాయో ఈ ఘటన తెలియచెబుతుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad