లంకపై భారత్‌ ఘన విజయం.. రోహిత్ డబుల్ సెంచరీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, December 14, 2017

లంకపై భారత్‌ ఘన విజయం.. రోహిత్ డబుల్ సెంచరీ

Rohit Sharma Slams Third ODI Double Century to Help India Crush SL by 141 Runs
ధర్మశాల వన్డేలో ఎదుర్కొన్న ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్‌ గెలవాలన్న లంకేయుల ఆశలు అడియాసలు చేసింది. మొహాలిలో 141 పరుగుల తేడాతో భారత్ అద్వితీయ విజయం సాధించింది. రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీతో మూడు వన్డేల సిరీస్‌1-1తో సమం అయింది. ఇక నిర్ణయాత్మక చివరి విశాఖ వన్డేలో గెలిచినవారే విజేత. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రోహిత్‌ శర్మ (208 నాటౌట్‌; 153 బంతుల్లో 13×4, 12×6) మూడో డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. అతనికి తోడుగా కొత్త కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌
(88; 70 బంతుల్లో 9×4, 2×6), శిఖర్‌ ధావన్‌ (68; 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలతో చెలరేగడంతో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకలో ఏంజెలో మాథ్యూస్‌ (111 నాటౌట్‌; 132 బంతుల్లో 9×4, 3×6) అజేయ శతకంతో నిలిచినా లాభం లేకపోయింది. ఆతిథ్య బౌలర్లు యజ్వేంద్ర చాహల్‌ 3, బుమ్రా, 2, భువి, పాండ్య, అరంగేట్రం కుర్రాడు వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టడంతో శ్రీలంక విలవిల్లాడింది. 8 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేయగలిగింది. అసేల గుణరత్నె (34; 30 బంతుల్లో 5×4) మినహా మరెవ్వరూ రాణించలేదు.

ఏకైక హ్యాట్రిక్‌ డబుల్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం అందించింది. గబ్బర్‌ 47 బంతుల్లో అర్ధశతకం బాదేశాడు. తొలి వికెట్‌ తీయడానికి లంక 21.1వ ఓవర్‌ వరకు ఎదురుచూసింది. ఈ క్రమంలో కొత్త కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌ (88)తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అతనితో కలిసి రెండో వికెట్‌కు 213 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ బంతికో పరుగు చొప్పున చేశారు. శ్రేయస్‌ అర్ధశతకం పూర్తికాగానే హిట్‌మ్యాన్‌ 115 బంతుల్లో శతకం సాధించాడు. అప్పుడు 40వ ఓవర్‌ నడుస్తోంది.

సెంచరీ తర్వాత విధ్వంసమే చూపించాడు రోహిత్‌. 100 చేసిన తర్వాత కేవలం 35 బంతుల్లో మరో 100 పరుగులు చేసి కెప్టెన్‌గా తొలి డబుల్‌, ఆటగాడిగా హ్యాట్రిక్‌ డబుల్‌-200 అందుకున్నాడు. అతడి వూచకోత ఎలా సాగిందంటే అతనాడిన చివరి 27 బంతుల్లో స్ట్రైక్‌రేట్‌ 341. ఆ క్రమంలో 11 కళ్లు చెదిరే సిక్సర్లు, 3 బౌండరీలు బాదేశాడు. అతడి ఆటను చూసి స్టేడియంలో అభిమానుల కేరింతలు.. అరుపులు.. ఆనందం.. ఆకాశాన్నంటాయి. లంక సారథి పెరీరా 3 వికెట్లు తీశాడు.

Read in English: Rohit Sharma Slams Third ODI Double Century to Help India Crush SL by 141 Runs

No comments:

Post a Comment

Post Bottom Ad