ఆధార్‌కు అనుసంధానానికి మార్చి 31వరకు గడువు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, December 14, 2017

ఆధార్‌కు అనుసంధానానికి మార్చి 31వరకు గడువు

Deadline to link Aadhaar with bank accounts extended till March 31

డిసెంబర్‌ 31తో ముగుస్తుందని చెప్పిన ఆధార్ అనుసంధాన గడువును మరో మూడు నెలల పాటు కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆధార్‌ అనుసంధానం చేసుకోవచ్చునంటూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫోలియోలు, డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు, పాన్, పోస్టాఫీసు ఖాతాలు, బీమా పాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు, మొబైల్‌ సిమ్‌ రీవెరిఫికేషన్‌కు మరింత సమయం లభించింది. ఫలితంగా ఈ నెల 31 తర్వాత తమ ఖాతాలు బ్లాక్‌ అయిపోతాయని, ఇతరత్రా సేవలు నిలిచిపోతాయని వస్తున్న ఆందోళనలకు తెరపడింది. ఆధార్‌ను సవాలు చేస్తూ దాఖలైన ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా... సంక్షేమ పథకాలకు, పలు రకాల సేవలకు ఆధార్‌ అనుసంధాన గడువును పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం విధితమే. ప్రభుత్వ గత ఆదేశాలను చూస్తే బ్యాంకుల్లో పాత, కొత్త ఖాతాలకు, రూ.50,000కు మించిన లావాదేవీలకు పాన్, ఆధార్‌ నంబర్‌ కోట్‌ చేయడం తప్పనిసరి. ఇందుకు ఈ ఏడాది డిసెంబర్‌ 31 దాకానే గడువు. అయితే ఈ నోటిఫికేషన్‌ను కేంద్రం ఉపసహరించుకుని దీని స్థానంలో మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Read in English: Deadline to link Aadhaar with bank accounts extended till March 31

No comments:

Post a Comment

Post Bottom Ad