లంకతో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, ధావన్‌ అజేయ సెంచరీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 18, 2017

లంకతో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, ధావన్‌ అజేయ సెంచరీ

India Beat Sri Lanka By 8 Wickets, Win Series 2-1
వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్‌ శర్మ బృందం 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విజయం కావడం విశేషం. 27 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్‌ 160/2 ఉండగా 215కే లంకేయులను ఆలౌట్‌ చేసి భారత బౌలర్లు తమ సత్తా చాటారు. భారత స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (3/42), యజువేంద్ర చహల్‌ (3/46) అద్భుతంగా రాణించారు. బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపారు. బ్యాటింగ్లో శిఖర్‌ ధావన్‌ (85 బంతుల్లో 100 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో... శ్రేయస్‌ అయ్యర్‌ (63 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో భారత్‌ను విజయాన్ని సునాయాసంగా అందుకుంది. కుల్దీప్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... శిఖర్‌ ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ సిరీస్‌’ అవార్డులు లభించాయి. మొదట శ్రీలంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. తరంగ (82 బంతుల్లో 95; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... సమరవిక్రమ (42) రాణించాడు. తర్వాత భారత్‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసి గెలిచింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కటక్‌లో 20న మొదలవుతుంది.

Read in English: India Beat Sri Lanka By 8 Wickets, Win Series 2-1

No comments:

Post a Comment

Post Bottom Ad