సీజీజీ వర్సెస్ టీఎస్‌పీఎస్సీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

సీజీజీ వర్సెస్ టీఎస్‌పీఎస్సీ

tspsc versus cgg

తెలంగాణలో ఆరేళ్ల క్రితం నాటి గ్రూప్-1 నియామకాల ఫలితాలు.. అనేక కేసులు, వాయిదాలు, రీఎగ్జామ్స్ అనంతరం ఎట్టకేలకు విడుదలై, వివాదాస్పదమై, ఫలితాలనే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అభ్యర్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఇవ్వాల్సిన పోస్టింగులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) ఇచ్చిన తప్పుడు డేటా వల్ల పోస్టింగులే మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ పొరపాటు సర్కారుకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో విచారణకు కూడా ఆదేశించింది. టీఎస్పీఎస్సీలో తరచూ ఇలా పొరపాట్లు జరగడం ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండడంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అయితే సీజీజీ డేటా ఇచ్చినప్పుడు దాన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ మీదే ఉంటుంది. సీజీజీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. తాము డేటా ప్రాసెసింగ్ ఏజెన్సీ మాత్రమేనని, దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీ అధికారులదేనని చెబుతున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad