కాంగ్రెస్లో రేవంత్కు ఏ హోదా దక్కేను? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

కాంగ్రెస్లో రేవంత్కు ఏ హోదా దక్కేను?

revanth to become pcc working president

తెలుగుదేశం పార్టీలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సమయంలో తగిన పదవిని ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్కు ఏ హోదా దక్కబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశంలో ఏ హోదాతో అయితే ఉన్నారో.. అదే హోదాను ఇక్కడా ఇవ్వడానికే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి కి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను ఇస్తే కాంగ్రెస్లో ఇకపై ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండడానికీ అవకాశం ఉంది. రేవంత్కు ఈ హోదా దక్కితే కాంగ్రెస్లోని సీనియర్లు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. రేవంత్ చేరికను కాంగ్రెస్ నేతలు బహిరంగంగా స్వాగతించినా లోలోపల వ్యతిరేకున్నరని సమాచారం. ఈ విషయంలో మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ రేవంత్ రాకను తాను వ్యతిరేకించడం లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా రేవంత్కు పదవులు ఇవ్వద్దని చెప్పిన ప్రచారాన్ని కూడా ఆమె కొట్టిపారేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad