చిన్నప్పటి ఆశ తీరిందన్న రాజశేఖర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 01, 2017

చిన్నప్పటి ఆశ తీరిందన్న రాజశేఖర్

rajashekhar-garudavega-movie-release
ముప్పై ఏళ్లకు పైగా నటజీవితంలో హీరోగా ఎన్నో విభిన్న పాత్రలు చేసిన రాజశేఖర్ ఈసారి సరికొత్త రోల్ పోషించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తలంబ్రాలు, శృతిలయలు, ఆహుతి, అంకుశం, మగాడు, అల్లరిప్రియుడు, అన్న తదితర చిత్రాలతో కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్లు సాధించాడు. అయితే ఆయనకు చిన్నప్పటినుంచి జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చేయాలని ఆశ ఉండేదట. చాలామంది దర్శక, నిర్మాతలకూ ఈ విషయం చెప్పినప్పటికీ ‘బాగుంటుందండీ’ అని ఊరుకునేవాళ్లే కానీ ఎవ్వరూ సాహసించలేదు పాపం. ఎందుకంటే ఆ తరహా కథలు తెరకెక్కించాలంటే భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాలి కాబట్టి. తన కల అలానే ఉండిపోతుందేమో అనుకొంటున్న తరుణంలో ప్రవీణ్‌ సత్తారు ‘మగాడు 2’ అనే స్క్రిప్టు చెప్పారట. ఇంకేముంది ఎగిరిగంతేసి ‘అదిరిపోయింది.. నేను ఎదురుచూస్తోంది ఈ కథ గురించే కదా’ అనుకుని వాళ్ల నాన్నగారి స్నేహితుడికి కథ వినిపించడం, ఆయనకు నచ్చడంతో తన ఆశనెరవేరింది. అదేనండీ.. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో, పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, సంజయ్‌రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పీఎస్‌వీ గరుడవేగ 126.18ఎం’. శుక్రవారం (నవంబరు 3) ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై రాజశేఖర్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజశేఖర్ కెరీర్లోనే ఇది అత్యంత భారీబడ్జెట్ సినిమా. సినిమా ఎలా ఉందనే ప్రశ్నకు గతంలో మాదిరి సూపర్‌... డూపర్‌.. అదిరిపోయింది అని చెప్పకుండా అన్ని సినిమాల్లా కాకుండా తన కెరీర్లో మంచి చిత్రంగా నిలిచేలా ఉంటుందని చెప్పారు. ఇదివరకు తన ‘గడ్డం గ్యాంగ్‌’, ‘మహాంకాళి’ సినిమాల విడుదల సమయంలో సూపర్, డూపర్ అని చెప్పినా ఆడలేదని ఆయన  గుర్తు కూడా చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad