పవన్ చిన్నకొడుకు కొత్త పేరు తెలుసా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

పవన్ చిన్నకొడుకు కొత్త పేరు తెలుసా?


pawans son named as mark shankar pawanovich

పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజునివా ఇటీవలే ఒక కొడుకును ప్రసవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి పేరేంటి.. అనేది చర్చలోకి వచ్చింది. మొన్నటివరకు కుశాల్ బాబు అనే పేరు ప్రచారంలో ఉండగా తాజాగా మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కొత్త పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది నిజంగా పవన్ కల్యాణ్ చిన్న తనయుడి పేరేనా.. అనేది ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది. అయితే ఏ విషయంపైనైనా ట్విట్టర్లో స్పందించే ఆర్జీవీ ఈ విషయంలోనూ తనదైన శైలిలో స్పందించాడు. భాషలు పుట్టిన తర్వాత, నాగరికతలు మొదలైన తర్వాత తను ఇంత గొప్ప పేరు వినలేదని ఆర్జీవీ ఫేస్‌బుక్ లో పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ తనయుడి పేరు ముందు తను తలవంచుతున్నా.. అని చెప్పుకొచ్చాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad