అధికారులను అడ్డంగా వాడుకుంటున్న ఏపీ సర్కారు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

అధికారులను అడ్డంగా వాడుకుంటున్న ఏపీ సర్కారు!

iyr krishnarao complaint to ec on ap government ap governmemt uses officers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. తాజాగా ఎన్నికల ముఖ్య అధికారిగా రిటైరైన బన్వర్ లాల్ పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఆయన ఈ విషయమై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా పనిచేయమంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన భన్వర్‌లాల్‌ను ఏడేళ్ల పాటు ఒకే పోస్టులో ఉంచిన విషయాన్ని ఐవైఆర్‌ ఆ లేఖలో ప్రస్తావించారు. భన్వర్‌లాల్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించలేదనే కక్ష పెంచుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. భన్వర్‌లాల్ రిటైర్ అయిన తర్వాత ఓ చిన్న విషయాన్ని వివాదంగా మార్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మోపిన అభియోగాలపై ఎన్నికల సంఘమే దర్యాప్తు చేయాలని ఐవైఆర్ ఫిర్యాదులో ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad