హైటెక్ కాపీ ఐపీఎస్ సస్పెన్షన్? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

హైటెక్ కాపీ ఐపీఎస్ సస్పెన్షన్?


ips-officer-safeer-karim-suspenstion-for-cheating-in-upsc-civil-services-main-exam

ఐఏఎస్ కావాలనే కోరికతో యూపీఎస్సీ పరీక్షల్లో హైటెక్ కాపీ కొడుతూ పట్టుబడ్డ కరీంను ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. తిరునల్వేలిలో ఎస్పీగా పనిచేస్తున్న కరీంకు ఐఏఎస్ కావాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఆయన హైదరాబాద్ లోని లా ఎక్సలెన్స్ అనే కోచింగ్ సెంటర్తో ఒప్పందం అయి అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పరీక్షలలో కాపీ కొడుతూ పట్టుబడి, అరెస్టయిన విషయం తెలిసిందే. తర్వాత విచారణలో అతని భార్య జోయస్ను, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రాంబాబును కూడా అరెస్టుచేశారు. ఇప్పుడు ఈ విషయంపై సీరియస్ అయిన కేంద్ర హోం శాఖ అతనిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రతిపాదన చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad