సివిల్ సర్వెంట్లా... సెల్ఫ్ సర్వెంట్లా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 01, 2017

సివిల్ సర్వెంట్లా... సెల్ఫ్ సర్వెంట్లా?

anupam-agarwal-ipsప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూడడం, ప్రజాశ్రేయస్సుకు పాటు పడడం సివిల్ సర్వెంట్ల పని. అత్యంత పోటీని ఎదుర్కొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సర్వీస్లో చేరి ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పుకునే సివిల్ సర్వీస్ అధికారులు సర్వీస్లో చేరాక సరికొత్త జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలతో కలిసి ప్రజల మేలు కంటే స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారు. ప్రజాపాలనకు తూట్లు పొడుస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది కేసుల్లో ఇరుక్కున్నవాళ్లు కూడా ఉన్నారు. సుమారు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న విషయాన్ని ఇటీవలే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రజలకు మంచి చేసే అధికారులు ఉన్నప్పటికీ సొంత లాభం కోసం మాత్రమే సర్వీసులోకి వచ్చే వారి సంఖ్య పెరగడం దురదృష్టకరం.
తాజాగా బెంగళూరులో ఓ ఐపీఎస్ అధికారి క్రీడాకారుల కోసం నిర్మించిన స్టేడియంలో భార్య ప్రక్టీస్ చేస్తుందనే నెపంతో అథ్లెట్స్నే బయటకు గెంటేశారని ఒక ఐపీఎస్‌ అధికారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంఠీరవ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయడానికి జాతీయ అథ్లెట్స్‌ స్టేడియంకు చేరుకున్నారు. అదే సమయంలో కంఠీరవ స్టేడియం డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అనుపమ్‌ అగర్వాల్‌ భార్య స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తుండడంతో మిగతావారిని సిబ్బందితో కలసి స్టేడియం నుంచి బయటకు పంపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత్యంతరం లేని క్రీడాకారులు స్టేడియంకు సమీపంలోనున్న కబ్బన్‌పార్క్‌లో ప్రాక్టీస్‌ చేశారని సమాచారం. అంతేకాకుండా ఘటనపై క్రీడాకారులతో పాటు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు స్వీకరించరాదంటూ పోలీస్‌ స్టేషన్‌లకు సూచించినట్లు కూడా తెలిసింది. దీంతో ఘటనపై బాధితులు సంపిగె రామనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోగా స్వీకరించడానికి పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యువజన క్రీడాశాఖా మంత్రి ప్రమోద్‌ మధ్వరాజ్‌ కలగజేసుకుని అనుపమ్‌ అగర్వాల్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad