నాయకులకు ప్రత్యేక న్యాయస్థానాలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

నాయకులకు ప్రత్యేక న్యాయస్థానాలు

sc asks centre to prepare scheme for special courts to deal with cases involving politicians
కోర్టుల్లో కేసుల భారం ఎక్కువైపోయి, ప్రజాప్రతినిధుల కేసులను నిర్ణీత సమయంలో పూర్తిచేయడం వీలుకావడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రానికి ప్రత్యేక సూచన చేసింది. దేశంలో రాజకీయ నాయకులపై ఉన్న కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ రాజన్ గోగోయ్, నవీన్ సిన్హాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ కేంద్రానికి సూచించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది.

No comments:

Post a Comment

Post Bottom Ad