ప్రభుత్వం గుండెల్లో పాదయాత్ర గుబులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

ప్రభుత్వం గుండెల్లో పాదయాత్ర గుబులు!

 Jagan-terror-in-ap-govt

ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర ముహూర్తం సమీపిస్తుండడంతో తెలుగుదేశం ప్రభుత్వం గుండెల్లో గుబులు పుడుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నవిషయం తెలిసిందే. నవంబర్‌ 6వ తేదిన ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. నాలుగేళ్లుగా ప్రజాసంక్షేమాన్ని వదిలి నిస్సిగ్గుగా ప్రచారానికే పరిమితమైన దుష్ట పాలనపై జగన్ పాదయాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్లనున్నారు.

ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతను జగన్ ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటాడోనని ప్రభుత్వం హడలిపోతోంది. పాదయాత్రలో నిజాలు నిగ్గుతేలతాయని గమనించిన సర్కారు... ముందుగానే జగన్పై బురద జల్లడానికి ప్రయత్నిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న పాదయాత్రపై ఎదురు దాడి ముమ్మరం చేయాలని భావిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ సమావేశాలను ఎందుకు బహిష్కరించిందనే విషయాన్ని పట్టించుకోకుండా మిగిలిన అంశాలతో ఎదురు దాడి చేయాలని టీడీపీ  చూస్తోంది. అందుకు అనుగుణంగానే పాదయాత్ర గడువు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నేతలు దాడి తీవ్రత పెంచారు. జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.


No comments:

Post a Comment

Post Bottom Ad