మద్యం తాగినందుకు ఐపీఎస్ సస్పెండ్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 02, 2017

మద్యం తాగినందుకు ఐపీఎస్ సస్పెండ్!

IPS officer suspension due to heavy drinking

అధికారిక వాహనంలో మద్యం తాగి ప్రయాణించడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో కేరళ ప్రభుత్వం ఓ ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. స్నేహితుడు ఇచ్చిన పార్టీలో ఐజీ స్థాయి వ్యక్తి జయరాజ్, ఆయన కారు డ్రైవర్ కూడా ఎక్కువగా తాగి కారును నిర్లక్ష్యంగా నడిపారు. దీనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగి వాహనం నడుపుతున్నట్లు తేలడంతో డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారు. ఐజీని కూడా పరీక్షించగా మోతాదుకు మించి తాగి ఉన్నట్లుగా తేలింది. అఖిల భారత అధికారుల సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించాడనే కారణంతో కేరళ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad