నాటి హీరోలే నేటి విలన్లు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 01, 2017

నాటి హీరోలే నేటి విలన్లు!

Heros showing interest in doing villain characters
హీరోలుగా కెరీర్ ప్రారంభించి చివర్లో విలన్ పాత్రలు చేస్తూ సక్సెస్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోనే ఉంది. ఈ కోవలో జగపతిబాబు అరవింద్ స్వామి తదితరులు చేరి విజయాలను ఆస్వాదిస్తున్నారు. అయితే విలన్ పాత్రలు సైతం చేస్తానన్న రాజశేఖర్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. హీరో పాత్రల కంటే విలన్ పాత్రలు సులభంగా చేయొచ్చన్నది ఆయన భావన. కానీ 30 కథలు విన్నప్పటికీ ఒక్కదాన్ని ఓకే చేయలేకపోయానంటున్నారు. ముందు విలన్ను భయంకరంగా చూపి, తర్వాత హీరో చేతిలో తన్నులు తినే పాత్రలు చేయనంటున్నారు. ‘ధృవ’లో అరవింద్‌ స్వామి లాంటి పాత్ర ఉన్న కథలతో వస్తే తప్పకుండా చేస్తానంటున్నారు. చూడాలి అలాంటి పాత్రను ఎవరు సృష్టిస్తారో!

No comments:

Post a Comment

Post Bottom Ad