యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం రాత్రి బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. యాదగురిగుట్ట మండలం బాహుపేట వద్ద వేగంగా వెళ్తున్న వజ్ర ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment