నితిన్, మేఘా ఆకాశ్ - నో లవ్ స్టోరీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

నితిన్, మేఘా ఆకాశ్ - నో లవ్ స్టోరీ

nitin-megha-akash-lovestory
హీరో నితిన్‌, మేఘా ఆకాశ్‌ జోడీగా ‘లై’ చిత్రంలో నటించారు. ఇప్పుడు మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ‘లై’ సినిమా తర్వాత నితిన్‌, మేఘా ప్రేమించుకుంటున్నారని కొంతకాలం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీకాకుండా ఇప్పుడు నటిస్తున్న సినిమాకు నితిన్‌ కోసమే డేట్లు సర్దుబాటు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హీరో నితిన్‌తో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేసి గుసగుసలకు ఫుల్స్టాప్ పెట్టారు నటి మేఘా ఆకాశ్‌. తాజాగా ఈ విషయమై మేఘా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన గురించి వస్తున్న వార్తలను ఖండించారు. నితిన్‌తో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేశారు. నితిన్‌తో ప్రస్తుతం నటిస్తున్న సినిమా కోసం డేట్లు సర్దుబాటు చేసుకోవాలని చిత్రబృందం తనని కోరిందని అందుకే సినిమాకు తగ్గట్టు డేట్లు సర్దుబాటు చేసుకున్నానని మేఘా ఆకాశ్‌ వెల్లడించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad