Video Of Day

Breaking News

కూరగాయలు పండిస్తున్న డేరా బాబా! రోజుకు రూ. 20 కూలీ!!

లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య గురువుగా ఉండే డేరా సచ్ఛాసౌధ అధిపతి గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ సింగ్ ఉరఫ్ డేరా బాబా ప్రస్తుతం రోహ్‌తక్‌ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో బాబాకు ఈ గతి పట్టిన విషయం తెలిసిందే. ఈ కేసుతో డేరా బాబా జీవితం తలకిందులైంది. రాజభోగాలు, విలాసాలు వదిలి కటకటాలు లెక్కపెడుతున్నాడు. అందరు ఖైదీల మాదిరిగానే బాబాకూ రోజూ తోట పని చేసి కూరగాయలను పండిస్తున్నాడు. ఈ  పనిచేసినందుకు గాను గుర్మీత్‌కు ఇచ్చే వేతనం రోజుకు రూ.20కి మించడంలేదు. ఎందుకంటే నైపుణ్యంలేని పనులకు హరియాణా జైళ్లలో ఇచ్చే ఫిక్స్‌డ్‌ వేతనం అదే. బాబాకు టెలివిజన్‌, వార్తా పత్రికలను సైతం అతడికి అందుబాటులో లేవు. భద్రతా కారణాల దృష్ట్యా ఫోన్‌ కాల్స్‌ చేసుకొనేందుకు సైతం వీలులేదు. గుర్మీత్‌ జైలు జీవితానికి సంబంధించిన ఈ విషయాలను జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్‌ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

No comments