కొరటాల శివ వెయిట్ చేయాల్సిందే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 05, 2016

కొరటాల శివ వెయిట్ చేయాల్సిందే

koratala shiva waitng
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా తర్వాత దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో రాజకీయ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ముందుగా అనుకున్నట్లు ఆ సినిమా కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది . అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాలి కానీ అలా జరగడం లేదు ఎందుకంటే ఇప్పటికి మురుగదాస్ సినిమా 65 శాతం మాత్రమే పూర్తికాగా ప్రస్తుతం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా పూర్తి కావాలంటే జనవరి దాటుతుందట దాంతో కొరటాల శివ తో చేసే సినిమా ఆలస్యం అవుతుంది . అంటే శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ - కొరటాల కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూపులు తప్పనిసరి.

No comments:

Post a Comment

Post Bottom Ad