బీజేపీకి ఇలాంటి కక్కుర్తి పనికిరాదేమో..! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, July 15, 2016

బీజేపీకి ఇలాంటి కక్కుర్తి పనికిరాదేమో..!

భారతీయ జనతా పార్టీ అంటే.. విలువలకు ప్రతిరూపం అనుకున్నాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించే బీజేపీ నేతలు రాజకీయంగా కూడా విలువలు పాటిస్తారని ఆశించడం పెద్ద నేరం ఏమీ కాదు. అది కూడా బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. భారతీయ ప్రజానీకం భారీ మెజారిటీని ఇచ్చి బీజేపీకి అధికారాన్ని అప్పగించారు, మోడీని ప్రధానమంత్రిని చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తను చేయగలిగింది ఏమైనా ఉంటే చేసి చూపవచ్చు!

స్పష్టమైన మార్పు చూపడానికి అవకాశాన్ని ఇచ్చే అధికారం చేతిలో ఉన్నా… బీజేపీ మాత్రం చాలా కక్కుర్తి పడుతోంది. బుల్లి బుల్లి రాష్ట్రాల్లో అధికారం కోసం అర్రులు చాచుతోంది. ప్రజాస్వామికంగా బీజేపీ అక్కడ ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకుంటే మంచిదే కానీ, అడ్డదారిలో .. అక్కడి ప్రభుత్వాల్లో అలజడి రేపడం మాత్రం బీజేపీకి తగని రాజకీయం. అలా చేస్తే ఎదురుదెబ్బలు తప్పవు అని బీజేపీ గ్రహించాలి.ఇప్పుడు అరుణాచల్ లో  బీజేపీ లేవదీసిన  తిరుగుబాటుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బతగలడం ఆసక్తికరంగా ఉంది.
కాంగ్రెస్ కు అరుణాచల్ అసెంబ్లీలో స్పష్టమైన ఆధిక్యం ఉంది. 60 మందికి 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే వారిలో ఒక తిరుగుబాటు వచ్చింది. 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.. వారికి బీజేపీ సహకారం ఉంది. అక్కడ పరిణామాలను ఆసరాగా చేసుకుని రాష్ట్ర పతి పాలన విధించింది కేంద్రం. ఈ పరిస్థితులను మరింతగా క్యాష్ చేసుకొంటూ.. అక్కడ తిరుగుబాటు దారుడి చేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడానికి గవర్నర్ సహకారంతో బీజేపీ ఒక వ్యూహాన్ని సిద్ధం చేసింది.  అయితే ఈ వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి గవర్నర్ ఆదేశాలన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్న బీజేపీకి ఎదురుదెబ్బతగిలినట్టు అయ్యింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad