తెలుగుదేశంలో ఉన్నది 'రెడ్లు' మాత్రమే..! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, July 25, 2016

తెలుగుదేశంలో ఉన్నది 'రెడ్లు' మాత్రమే..!

andhrapradesh_CM_chandrababunaidu_TDP
తెలుగుదేశం పార్టీ అంటే.. కమ్మ వాళ్లు ఓన్ చేసుకున్న పార్టీ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని గట్టిగా సమర్థించే వాళ్లు, పచ్చ పార్టీని అత్యంత ఆత్మీయంగా భావించేది.. ఆ పార్టీ అధికారంలో ఉండాల్సిందే అని కోరుకునే వారు.. కమ్మ వాళ్లే! ఇతర పార్టీ నుంచి తెలుగుదేశానికి మద్దతు లేదు అని కాదు కానీ.. తెలుగుదేశం పార్టీకి ప్ఱధానంగా మద్దతు పలికేది మాత్రం కమ్మ వాళ్లే.

మరి వీరికి భిన్నమైన పరిస్థితి రెడ్లది. వీళ్లు ఆది నుంచి కాంగ్రెస్ కు అనుకూలురు. ఆ పార్టీని ఓన్ చేసుకున్న వాళ్లు. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ నుంచి ఎంతో మంది రెడ్లకు అవకాశాలు దక్కాయి. కాంగ్రెస్ ద్వారా అనేక మంది రెడ్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో.. రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే పార్టీ పరిస్థితి బాగుంటుందనేది కాంగ్రెస్ అధిష్టానం కూడా లెక్కలేస్తూ ఉంటుంది. 

ఈ విధంగా రెడ్లకు లేని తెలుగుదేశం వ్యతిరేకత వచ్చింది. రెడ్లు అంటే.. తెలుగుదేశం వ్యతిరేకులు అనే భావన పెరిగింది. పరిణామాలు కూడా అందుకు తగ్గట్టుగానే కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇలాంటి పరిణామాలకు, సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నాయి కరెంట్ ఎఫైర్స్. తాజాగా టీ.టీడీపీ నేతల తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్నది అంతా రెడ్లే.

 రేవంత్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, పెద్ది రెడ్డి, నర్సారెడ్లిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే అనేక మంది నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడిన నేపథ్యంలో టీడీపీలో వీళ్లే మిగిలారు. ఇక రావుల చంద్ర శేఖరరెడ్డి వంటి వాళ్లు కూడా తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్నారు. మరి ఈ పరిస్థితిని చూస్తుంటే.. రెడ్లకు వ్యతిరేకమనే ఇమేజ్ ను కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీకి రెడ్లే చుక్కానులయ్యారు!

No comments:

Post a Comment

Post Bottom Ad