రవిబాబు కి ఈ సారి ‘అ’ కలిసొస్తుందా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, July 15, 2016

రవిబాబు కి ఈ సారి ‘అ’ కలిసొస్తుందా!

అవును-2 నిరాశ పరచడంతో కొంత విరామం తీసుకున్నట్టుగా కనిపిస్తున్నా.. చాలా సైలెంట్ గా తన తర్వాతి సినిమా వర్క్ ను పూర్తి చేశాడు దర్శక, నటుడు రవిబాబు. ఒక పంది పిల్ల ను ప్రధాన పాత్రలో పెట్టి  ఈ సినిమాను రూపొందించినట్టుగా ప్రకటించి అందరినీ  ఇది వరకే ఆశ్చర్య పరిచాడు ఈ దర్శకుడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సారి దర్శకుడు తన సినిమాల విషయంలో “అ’’ అక్షరం సెంటిమెంటును ఫాలో అవుతుండటం. ఇది వరకూ రవిబాబు కెరీర్ లో హిట్టు సినిమాల పేర్లను చూస్తే.. అల్లరి, అవును, అనసూయ వంటి సినిమాలున్నాయి.

ఈ నేపథ్యంలో…
ఈ పందిపిల్ల సినిమా పేరును ‘అదిగో’ అని పెట్టాడు దర్శకుడు.

ఇదే సమయంలో గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. రవిబాబుకు తీసిన ప్లాఫులు కూడా ‘అ’ అక్షరంతో వచ్చే టైటిల్స్ తోనే ఉంటాయి. అమ్మాయిలు –అబ్బాయిలు, అవును-2 వంటి ఆ జాబితాలోవి. అయితే రవిబాబుని ఈ సారి కూడా ‘అ’ వదల్లేదు.
మరి అ అక్షరంతో టైటిల్ ఉన్న ఈ దర్శకుడి సినిమాల్లో కొన్ని ప్లాఫులూ ఉన్నాయి, హిట్టు ఉన్నాయి..ఈ సారి ఏ సెంటిమెంటు రిపీటవుతుందో!

No comments:

Post a Comment

Post Bottom Ad