బాలకృష్ణకు తప్పిన ప్రమాదం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 29, 2016

బాలకృష్ణకు తప్పిన ప్రమాదం

సినీనటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ లోని కారు యాక్సిడెంట్ కు గురైంది. కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోని చండూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో బాలకృష్ణ స్వయంగా కారు నడుపుతున్నారని... కారులో మొత్తం ఐదుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ సుబ్బారావు, సిబ్బంది మరో వాహనంలో బాలకృష్ణను బెంగళూరుకు పంపించారు. ధ్వంసమైన కారును అక్కడి నుంచి తరలించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad