సీఎంకే ముద్దు పెట్టింది.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 26, 2016

సీఎంకే ముద్దు పెట్టింది..

బెంగళూరు: ఓ బహిరంగ సభలో అందరూ చూస్తుండగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుగ్గలపై ఓ మహిళ ముద్దు పెట్టింది. ఆదివారం బెంగళూరులో కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌లూరు జిల్లా తారికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సన్మానించారు. అనంతరం ఆమె సభా వేదిక పైనే అందరూ చూస్తుండగానే సీఎం కుడిబుగ్గపై ముద్దు పెట్టేసింది. దీంతో సిద్ధరామయ్య కొంత ఇబ్బందిపడ్డట్టు కనిపించారు.

 ఈ ఘటనపై గిరిజ స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ 'సిద్ధరామయ్య నా తండ్రిలాంటివారు. ఆయనను నేను తొలిసారి కలిశాను. ఆ సంతోషంలో ఆయనకు ముద్దుపెట్టాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు' అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

No comments:

Post a Comment

Post Bottom Ad