'సర్దార్ గబ్బర్‌సింగ్ తో ' 'క్రికెట్ లెజెండ్'! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, November 22, 2015

'సర్దార్ గబ్బర్‌సింగ్ తో ' 'క్రికెట్ లెజెండ్'!

 pawan-kalyan-meets-ex-cricketer-kapil-dev
  ప్రముఖ లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిశారు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా ప్రస్తుతం గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.  చిత్ర యూనిట్ బస చేస్తున్న ఓ హోటల్‌లో పవన్ కల్యాణ్‌ను లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ అనుకోకుండా కలిశారు.

ఈ నేపథ్యంలో వారిరువురు కొంత సమయం పాటు ముచ్చటించారు. పవన్ కల్యాణ్ నటించిన కొన్ని సినిమాలను తాను చూశానని కపిల్ దేవ్ చిత్రయూనిట్‌కు తెలిపారు. ఇండియన్ క్రికెట్‌కు కపిల్ దేవ్ అందించిన సేవలు ఎనలేనివని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

దీంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన 'సర్దార్' బృందం వీరిరువురి మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రానున్న వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

No comments:

Post a Comment

Post Bottom Ad