బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2015

బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు

Lok Adalat court judge ADJ Raamulu on Saturday issued notices to actor and Hindupur MLA Bala Krishna, Hindupur Municipal Chairman R Laxmi and Municipal Commissioner Veerabadra Rao. The trio reportedly announced a plan in 1993 to lay 80-feet road on the Hindupur’s bypass from one town police station to Penukonda.  However, the project has not materialized.  The residents of the area have approached the Lok Adalat court saying that no road has been laid and they were facing a lot of hardship following which the judge issued the notice.

అనంతపురం జిల్లా హిందూపురం ఎంఎల్ఏ, సినీ నటుడు బాలకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ ఆర్.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావుకు శనివారం లోక్అదాలత్ కోర్టు న్యాయమూర్తి ఏడీజే రాములు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో ఆగస్టు 1న లోక్అదాలత్కు హాజరుకావాలని ఆదేశించారు.

హిందూపురం పట్టణంలోని బైపాస్ రోడ్డు నుంచి వన్టౌన్ పోలీసుస్టేషన్, ఫైర్స్టేషన్ మీదుగా పెనుకొండ రోడ్డుకు కలుపుతూ 1993లో 80 అడుగుల రోడ్డుగా విస్తరిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ రహదారిని ఏర్పాటు చేయడానికి పట్టణంలోని గురునాథ్ టాకీస్ నిర్వాహకులు పొలాలను కూడా మున్సిపాలిటికి ఉచితంగా అందించారు.

అయితే నేటికి విస్తరణ చేపట్టలేదని పట్టణానికి చెందిన వెంకటరాముడు అనే వ్యక్తి లోక్అదాలత్ను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణలో చొరవ చూపకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన న్యాయమూర్తి ప్రతివాదులైన ఎంఎల్ఏ బాలకృష్ణ, చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్కు నోటీసులు జారీ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad