నా బహుమతి ప్రదానోత్సవానికి మోడీ, నవాజ్ షరీఫ్ లు ఇరువురు రావాలి : మలాల - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 11, 2014

నా బహుమతి ప్రదానోత్సవానికి మోడీ, నవాజ్ షరీఫ్ లు ఇరువురు రావాలి : మలాల

తన బహుమతి స్వీకరణ కార్యక్రమానికి హాజరు కావాలని నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసుఫ్ జాయ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆ బాలిక శనివారం ప్రకటన విడుదల చేశారు. భారత్ కు చెందిన కైలాష్ సత్యార్థితో కలిసి మలాలా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సంగతి తెలిసిందే.
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించే విషయానికి సంబంధించి ఇప్పటికే సత్యార్థితో మాట్లాడానని చెప్పిన మలాలా, ఇరు దేశాల ప్రధానులు ఆ కార్యక్రమానికి హాజరైతే బాగుటుందన్నారు. ఇక భారత్, పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు సత్యార్థితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని మలాలా ప్రకటించారు. తామిద్దరం కలిసి ఇరుదేశాల మధ్య మరింత బలమైన సంబంధాలను నెలకొల్పేందుకు కృషి చేయనున్నామని ఆమె తెలిపారు. సత్యార్థిలో కలిసి మలాలా, డిసెంబర్ లో నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో నోబెల్ బహుమతిని అందుకోనున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad